
విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ లోనే కాదు ఫిట్ నెస్ లోనూ టాప్ లో ఉంటాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యత్తమ ఫిట్ నెస్ కలిగిన ఆటగాళ్ల లిస్ట్ తీస్తే కోహ్లీ టాప్ లో ఉంటాడు. తన సక్సెస్ లో ఫిట్ నెస్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్ లో చిరుతలా పరిగెత్తే కోహ్లీ.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో దిట్ట. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి కోహ్లీ సింగిల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడతాడు. సింగిల్స్ తోనే ప్రత్యర్థికి చికాకు తెప్పిస్తాడు. బంతులే వృధా చేయకుండా సింగిల్స్ పై ఫోకస్ చేస్తూ ఇన్నింగ్స్ ను నిర్మిస్తాడు.
ALSO READ | Champions Trophy 2025: సెమీ ఫైనల్‌కు కాన్వేను పక్కన పెట్టిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం (మార్చి 4) జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 84 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. మొత్తం 96 బంతుల్లో 84 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్ లో ఏకంగా 56 సింగిల్స్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోహ్లీ ఇన్నింగ్స్ లో మొత్తం 67 శాతం పరుగులు సింగిల్స్ తీయడం ద్వారా వచ్చాయి. మొత్తం కోహ్లీ ఇన్నింగ్స్ లో 5 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. జట్టు విజయం కోసం ఎలాంటి అనవసరపు షాట్స్ ఆడకుండా సింగిల్స్ తీస్తూనే కంగారులను విజయాన్ని దూరం చేశాడు.
కోహ్లీ వన్డే కెరీర్ లో మొత్తం 5,870 సింగిల్స్ ఉన్నాయి. ఏ క్రికెటర్ వన్డే కెరీర్ లో కూడా ఇన్ని సింగిల్స్ లేకపోవడం విశేషం. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 5,503 సింగిల్స్‌తో ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉండగా, మహేల జయవర్ధనే 4,789 సింగిల్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. భవిష్యత్తులో వన్డే ఫార్మాట్ లో కోహ్లీ సింగిల్స్ ను బ్రేక్ చేసే అవకాశం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది.
ఏకపక్షంగా జరిగిన ఈ సెమీస్ ఫైట్ లో ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (98 బాల్స్‌లో 5 ఫోర్లతో 84) మరోసారి మాస్టర్ క్లాస్ ఆట చూపెట్టడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఐదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) అండగా నిలవడంతో.. మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ (57 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 61) రాణించారు.
Virat Kohli took 64 runs in singles and doubles out of the 84 today
— Cinema Brainiac (@CinemaBrainiac) March 4, 2025
RUN machine for a reason 😍 pic.twitter.com/eCzinqPOQA