
రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (ఏప్రిల్ 2) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. టైటాన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ గట్టిగా స్వీప్ ఆడాడు. డీప్ మిడ్-వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని ఆపడానికి పరిగెత్తే ప్రయత్నంలో అతని చేతి వేలికి గాయం అయింది. దీంతో గ్రౌండ్ లోనే నొప్పితో కోహ్లీ చేయి ఊపుతూ కనిపించాడు.
కోహ్లీ గాయంపై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. విరాట్ గాయంపై ఆర్సీబీ హెడ్ కోచ్ క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతని ఎలాంటి సమస్య లేదని చెప్పాడు. దీంతో కింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బెంగళూరు ఐపీఎల్ లో తమ తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడడం ఖాయమైంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 6 బంతుల్లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. స్వేర్ లెగ్‌లో షాట్‌కు యత్నించి యంగ్ బౌలర్ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
Also Read : నేను వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. బుధవారం (ఏప్రిల్ 2) చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో సిరాజ్ నిప్పులు చెరగగా..ఆ తర్వాత ఛేజింగ్ లో బట్లర్( 39 బంతుల్లో 73:5 ఫోర్లు, 6 సిక్సర్లు) సాయి సుదర్శన్ (49) బ్యాటింగ్ లో అదరగొట్టారు. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్సీబీ తొలి పరాజయాన్ని మూట కట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది.
🚨 GOOD NEWS FOR RCB FANS 🚨
— Johns. (@CricCrazyJohns) April 3, 2025
- Andy Flower confirms Virat Kohli is fine. pic.twitter.com/KEBaExsyh4