బార్బడోస్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. విరాట్ కోహ్లీ, గిల్, ఇషాన్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ తనదైన స్టయిల్లో ప్రిపేర్ అవుతున్నాడు. బుధవారం అతను ఒకే టైమ్‌లో నలుగురు డిఫరెంట్ బౌలర్లను ఎదుర్కొంటూ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో తన స్టయిల్‌కు భిన్నమైన రివర్స్ స్వీప్ షాట్ కొట్టాడు. మరోవైపు పక్క వికెట్‌పై యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. తన ప్రాక్టీస్ ముగిసిన తర్వాత కోహ్లీ యంగ్‌స్టర్ యశస్వికి చాలా సేపు టిప్స్ ఇస్తూ కనిపించాడు.
గార్ఫీల్డ్ సోబర్స్‌తో ముచ్చట
ప్రాక్టీస్ సందర్భంగా స్టేడియానికి వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌ను టీమిండియా ఆటగాళ్లు కలిశారు. కోచ్ ద్రవిడ్ సోబర్స్‌కు ప్లేయర్లను పరిచయం చేశాడు.