న్యూఢిల్లీ : ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. తన హోమ్ టీమ్ ఢిల్లీ ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో ఆడే మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడని ఢిల్లీ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ చెప్పాడు.
మెడనొప్పి కారణంగా ఈ నెల 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో మాత్రం బరిలోకి దిగడం లేదన్నాడు. విరాట్ చివరగా 2012లో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీ పడ్డాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 23 నుంచి జమ్మూ కాశ్మీర్‌తో తలపడే ముంబై జట్టుకు అందుబాటులోకి వచ్చారు.