రికార్డుల రారాజుగా పేరు గాంచిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పరుగులు చేయడానికి తంటాలు పడుతున్నాడు. టీ తాగినంతా అలవోగా సెంచరీలు బాదే కోహ్లీ.. క్రీజ్‌లో నిలదొక్కునేందుకు కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్లో పరుగుల వరద పారించే రన్ మెషిన్.. చిన్న చిన్న జట్లపై కూడా తడబడుతున్నాడు. తనదైన రోజున జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించిన కోహ్లీ ప్రస్తుతం ఫామ్ లేమి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లోనూ కోహ్లీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ అభిమానులను తీవ్ర నిరాశ పర్చాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ పరుగులకే ఔట్ అయ్యి ఫ్యాన్స్ అంచనాలను తలకిందులు చేశాడు. తొలి టెస్ట్‌లో ఘోరంగా విఫలం కావడంతో కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించేందుకు కోహ్లీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. రెండో టెస్ట్‌లో భారీ స్కోర్ చేసి తనపై విమర్శలు చేసిన నోళ్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ కోసం నెట్స్‌లో కోహ్లీ చెమటోడ్చుతున్నాడు. అయితే, నెట్స్‌లో కూడా బ్యాటింగ్ చేసే సమయంలో కోహ్లీ బ్యాటింగ్ లో తీవ్రంగా ఇబ్బంది పడ్డట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. ఇందులో నాలుగు సార్లు ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంనేందుకు కోహ్లీ అవస్థ పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కోహ్లీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొంనేందుకు జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఉన్న నెట్స్ లో వెళ్లగా అక్కడ కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యింది. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొలేక పలుమార్లు వికెట్ పారేసుకున్నట్లు సమాచారం.
ALSO READ : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో..పంత్ @ 6
గ్రౌండ్ లో పరుగుల వరద పారించే కోహ్లీ.. క్రీజ్ లో నిలుదొక్కుకునేందుకే ఇబ్బంది పడుతుండటంతో విరాట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీకి ఏమైంది.. 15 బంతుల్లోనే నాలుగు సార్లు ఔట్ కావడం ఏంటి అంటూ తెగా ఫీల్ అయిపోతున్నారు కోహ్లీ వీరాభిమానులు. మరికొందరు మాత్రం ఇవన్నీ లైట్ అని.. ఏ సమయంలో ఎలా ఆడాలి.. ఒత్తిడిని ఎలా జయించాలనేది కోహ్లీకి తెలుసంటున్నారు మరీ కొందరు ఫ్యాన్స్. అయితే, కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తాడా లేక మరోసారి నిరాశ పరుస్తాడా తెలియాలంటే రెండో టెస్ట్ స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.