Virat Kohli: బంగ్లాపై కొడతాడా.. పాక్ వరకు ఆగాల్సిందేనా: ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

Virat Kohli: బంగ్లాపై కొడతాడా.. పాక్ వరకు ఆగాల్సిందేనా: ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

ఛాంపియన్స్ ట్రోఫీకి తొలి ముందు టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ఆల్ టైం రికార్డ్ ఊరిస్తుంది. సచిన్ రికార్డులను ఒకొక్కటిగా బద్దలు కొడుతూ వస్తున్న విరాట్ తాజాగా మరో ఆల్ టైం రికార్డ్ పై కన్నేశాడు. వన్డేల్లో ఇప్పటికే 50 సెంచరీలు చేసి సచిన్ సెంచరీల రికార్డును దాటేసిన కోహ్లీ.. ఇప్పుడు పరుగుల విషయంలో మరో అల్ టైం రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ పై భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 37 పరుగులు కొడితే వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 

ఇంగ్లాండ్ తో ఇటీవలే జరిగిన మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ తొలి రెండు వన్డేల్లో విఫలమైనా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి టచ్ లో కనిపించాడు. చివరి వన్డేలో 89 పరుగులు కొడితే 14 వేల పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేవాడు. కానీ 52 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో 37 పరుగులను నేడు బంగ్లాదేశ్ పై పూర్తి చేయాలని ఫ్యాన్స్ ఎంతగానో చూస్తున్నారు. ఈ రికార్డ్ ఇప్పటివరకు దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 2006 ఫిబ్రవరిలో పెషావర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 350వ ఇన్నింగ్స్‌లో 14,000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Also Read:-పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్..

శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర మార్చి (2015లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో) 378 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 13,963 పరుగులు సాధించాడు. కోహ్లీ మరో 63 ఇన్నింగ్స్ ల్లో 37 పరుగులు చేసినా రికార్డ్ బ్రేక్ అవుతుంది. అయితే అభిమానులు మాత్రం నేడు బంగ్లాపై జరిగే మ్యాచ్ లోనే బద్దలు కొట్టాలని ఆశిస్తున్నారు. 36 ఏళ్ళ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించాలని యావత్ దేశం కోరుకుంటుంది.