కోహ్లీ 74వ హాఫ్ సెంచరీ.. సెమీస్ లో విజయం దిశగా భారత్

కోహ్లీ 74వ హాఫ్ సెంచరీ.. సెమీస్ లో విజయం దిశగా భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‎లో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 5 ఫోర్లు బాదిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్స్ శుభమన్ గిల్ (8), కెప్టెన్ రోహిత్ శర్మ (28) తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆచితూచీ ఆడాడు. 

శ్రేయస్ అయ్యర్‎తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. కోహ్లీ, అయ్యర్ జోడీ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువలో (45) అయ్యర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (27) రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (73), కేఎల్ రాహుల్ (3) ఉన్నారు. ఈ మ్యాచులో విజయం సాధించాలంటే భారత్ 78 బంతుల్లో 78 పరుగులు చేయాల్సి ఉంది.