స్కాడాతో కోయిల్​సాగర్​ లింక్

స్కాడాతో కోయిల్​సాగర్​ లింక్

హైదరాబాద్, వెలుగు: కోయిల్​సాగర్​ ప్రాజెక్ట్​ నిర్వహణను ఆటోమేట్​చేయాలని ఇరిగేషన్​శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధునాతన సూపర్​వైజరీ కంట్రోల్ అండ్​ డేటా ఆక్విజిషన్​ (స్కాడా) సిస్టమ్​తో ప్రాజెక్ట్​ను అనుసంధానించాలని నిర్ణయించింది. రూ.2 కోట్ల అంచనాలతో ప్రాజెక్టును లింక్​ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జలసౌధలో ఓ అండ్​ ఎం ఈఎన్సీ నాగేందర్​రావు నేతృత్వంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రాజెక్టుల్లో పలు కాలువలు, పంపింగ్‌‌‌‌ స్టేషన్లు, చెరువులకు సంబంధించి స్కాడాతో కోయిల్​సాగర్​ అనుసంధానం సహా రూ.5 కోట్ల అంచనాలతో రూపొందించిన ఓ అండ్‌‌‌‌ ఎం పనులపై కమిటీ చర్చించింది. ప్రస్తుతం కోయిల్​సాగర్​ ప్రాజెక్టుకు ఇన్‌‌‌‌ఫ్లో, ఔట్‌‌‌‌ఫ్లో, నీటినిల్వలు, పంపింగ్‌‌‌‌ స్టేషన్లు, విద్యుత్‌‌‌‌ సరఫరా, గేట్ల నిర్వహణ తదితర వివరాలను మాన్యువల్‌‌‌‌ పద్ధతిలో సేకరిస్తున్నారు. అనంతరం డేటా అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నారు. 2008 నుంచి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ స్థానంలో రియల్‌‌‌‌ టైం డేటా సేకరణ కోసం అధునాత స్కాడా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.