మంచిర్యాలలో హోటల్​ నార్త్​ఇన్​ ప్రారంభం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో హోటల్ నార్త్ఇన్​ను బుధవారం జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర ఇన్​ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నార్త్ ఇన్ హోటల్ యాజమాన్యం హైదరాబాద్ తరహాలో  ఏర్పాటు చేసింది. బర్త్ డే పార్టీ లు, మ్యారేజ్ డే, వివిధ రకాల శుభ కార్యాలు ఒకేచోట జరుపుకునేలా ఈ హోటల్​ను తీర్చిదిద్దారు.

రెస్టారెంట్, బంకెట్ హాల్, విశాలమైన గదులు అనుభవజ్ఞులైన సిబ్బంది, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు, నీలి శ్రీనివాస్, నల్ల మల్లయ్య,హోటల్ యజమానులు నల్ల శ్రీనివాస్, ఓలేటి సీతారామాయ్య, రమణ చారి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.