ఆసిఫాబాద్, వెలుగు: తాను ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడలేదని, ఎవరినీ తిట్టలేదని, ఒకవేళ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహా ఎవరినైనా తిట్టినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అన్నారు. గత నెల 30న మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను దూషించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
ALSO Read : బీజేపీ నుంచి ఆరుగురు లీడర్ల సస్పెన్షన్
ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు అనిల్ గౌడ్, వసంత్ రావు, కుసుంరావు, సాయి, దుర్గం రమేశ్, రమేశ్, కళావతి తదితరులు పాల్గొన్నారు.