మనుషుల తరహాలో జంతువులకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా అచ్చం మునుషుల్లాగానే బాధపడుతుంటాయి. దెబ్బ తగిలినప్పుడు.. ఆరోగ్యం బాగా లేనప్పుడు చెప్పుకోలేవు కాని అవి పడే బాధ అంతా ఇంతా కాదు. ఏదైనా జంతువు చనిపోయినప్పుడు అదే జాతికి చెందిన జంతువు రోదన అంతా ఇంతా కాదు. మనుషులైతే బాధను వ్యక్త పరుస్తారు. కాని జంతువులు అలా వ్యక్తపర్చలేవు కాని... అవికూడా తోటి జంతువు మరణాన్ని తట్టుకోలేవు. అచ్చం మనుషుల మాదిరిగానే అవికూడా ఏడుస్తాయి.
కోలా జంతువు చనిపోతే... మరోకోలా దానిని పట్టుకొని ఏడుస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోలాజంతువు ఏడుపు పిల్లల ఏడుపు మాదిరిగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవికి భావోద్వేగాలుంటాయని ఈ వీడియో ద్వారా అర్దమవుతుంది.సొంత వారు చనిపోయినప్పుడు మనుషులు ఎలా ఏడుస్తారో.. జంతువులు కూడా అలానే ఏడుస్తాయి. ఈ సృష్టిలో మరణం ఏ జీవికైనా ఒకటే. బాధించేది ఒక్కలానే. భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు.. అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది.. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే చిన్న జీవులు. ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. .పూర్తి శాకాహార జీవులు.
సహచర కోలాను కోల్పోయిన ఓ కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ వీడియోలో ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు. చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఆడ కోలా మరణానికి కారణం తెలియరాలేదు.