కాంగ్రెస్​ను గెలిపిస్తే ఇందిరమ్మరాజ్యం : కొలను హనుమంత రెడ్డి

కాంగ్రెస్​ను గెలిపిస్తే ఇందిరమ్మరాజ్యం : కొలను హనుమంత రెడ్డి

జీడిమెట్ల, వెలుగు : ఇందిరమ్మ రాజ్యం రావాలంటే  కాంగ్రెస్​పార్టీని గెలించాలని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి అన్నారు. గాజులరామారంలోని చంద్రగిరినగర్ లో పలువురు నేతలు సోమవారం ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం కొంపల్లిలోని గౌతమి అపార్ట్ మెంట్స్, రాంకీ, ప్రిస్టిన్ సేన్ అపార్ట్ మెంట్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హనుమంత రెడ్డి మాట్లాడుతూ..   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు.

అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ గాగిల్లాపూర్ లో కొలను హనుమంత రెడ్డి సతీమణి కొలను నీరజా రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కుత్బుల్లాపూర్ లోని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.