
కోల్కతాలోని మెచువాపట్టి ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ బిల్డింగ్లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం అయినట్లు పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ తెలిపారు. కొందరు ప్రాణ భయంతో కిటికీల్లో నుంచి దూకే ప్రయత్నం చేశారు. ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ మీద నుంచి దూకడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
VIDEO | Kolkata: A massive fire broke out at a hotel in central Kolkata's Mechuapatti area on Tuesday night. At least 15 bodies have been recovered so far, Police Commissioner Manoj Verma said.
— Press Trust of India (@PTI_News) April 30, 2025
Several people were seen trying to escape through the windows and narrow ledges of… pic.twitter.com/aHyws4JHLX
చనిపోయిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఒకరు ప్రాణ భయంతో కంగారులో కిందకు దూకడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. మంగళవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్లో మంటలు రేగాయి. అలా పై ఫ్లోర్ల వరకూ మంటలు వ్యాపించాయి. 10 ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పడంతో బుధవారం వేకువజామున 3 గంటల 30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి.