కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ పై CBI జరిపిన పాలీగ్రాఫ్ టెస్ట్ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్ట్ 8 రాత్రి సంజయ్ అతని ఫ్రెండ్ తో ఆర్జీ కార్ హాస్పిటల్ కు వెళ్లినట్లు పాలీగ్రాఫ్ టెస్ట్ లో చెప్పుకొచ్చాడు. సంజయ్ రాయ్ అక్కడికి వెళ్లే సరికి ఆమె చనిపోయి ఉందని పాలీగ్రాఫ్ టెస్ట్ సమయంలో తెలిపాడు.
కోల్ కతా పోలీసుల విచారణలో ఉన్నప్పుడు నిందితుడు నేరాన్ని అంగికరించారని అధికారులు చెప్పారు. కానీ.. ఇప్పడు సంజయ్ రాయ్ తనను ఇరికించాలని చూస్తున్నారని.. అతనిపై ఉన్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆదివారం సంజయ్ రాయ్ కు సీబీఐ లై డిటెక్షన్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్ లో నిందితుడు సంచలన విషయాలు చెప్పాడు.
పాలీగ్రాఫ్ టెస్ట్ లో సంజయ్ రాయ్ చెప్పిన విషయాలు వరుసగా
- రాత్రి 11 గంటలకు మద్యం కోసం వారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు.
- రోడ్డు పై వైన్ షాప్ లో మద్యం తాగి.. అక్కడి నుంచి ఉత్తర కోల్ కతాలోని ఓ రెడ్ లైట్ ఏరియా సోనాగాచికు వెళ్లారు.
- అక్కడి నుంచి మరో రెడ్ లైట్ ఏరియా దక్షిణ కోల్ కతాలోని చెట్లాకు వెళ్లారు. అక్కడికి వెళ్తుండా రోడ్డుపై ఓ బాలికను వేధించామని సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు.
- తర్వాత చెట్లాలో రాయ్ ఫ్రెండ్ ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని.. ఆ టైంలో అతను తన గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడని పాలీగ్రాఫ్ విచారణలో చెప్పాడు.
- రాయ్ ఆమెను న్యూడ్ ఫోటోలు అడగగా.. ఆమె పంపింది.
- మళ్లీ రాయ్, అతని స్నేహితుడితో కలిసి ఆసుపత్రికి తిరిగి వచ్చాడు. నింధితుడు నాలుగో అంతస్తులోని ట్రామా సెంటర్‌కి వెళ్లనని టెస్ట్ లో చెప్పాడు.
- తెల్లవారుజామున 4:03 గంటలకు రాయ్ మూడో అంతస్తులోని సెమినార్ హాల్ సమీపంలోని కారిడార్‌కు వెళ్లడం CCTV ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.
- బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డి.. అక్కడి నుంచి కోల్‌కతా పోలీసు అధికారి అయిన అనుపమ్ దత్తా స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.
- బాధితురాలు నిద్రిస్తున్న సెమినార్ హాల్‌లోకి ప్రవేశించిన సంజయ్ రాయ్ ఆమెను గొంతు కోసి చంపాడని పోలీసులు చెప్తున్నారు.
- నేరం జరిగిన సమయంలో రాయ్ అతని ఫ్రెండ్ తో కాల్ మాట్లాడని సీబీఐ తెలిపింది.