
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2023, డిసెంబర్ 5న విడుదల చేసి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2022లో ప్రతి లక్ష మంది జనాభా కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాలలో 86.5 కేసులతో కోల్కతా ప్రథమ స్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి.
2021లో గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు కోల్కతాలో 103.4, పుణెలో 256.8, హైదరాబాద్లో 259.9గా నమోదైంది. 20 లక్షలకుపైగా జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని సమాచారంతో ఎన్సీఆర్బీఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల వివరాలతో క్రైం ఇన్ ఇండియా 2022 పేరిట ఎన్సీఆర్బీ ఈ నివేదికను విడుదల చేసింది.