IPL Retention 2025: రస్సెల్‌కు కోల్‌కతా బిగ్ షాక్.. అయ్యర్, స్టార్క్‌లకు తప్పని నిరాశ

IPL Retention 2025: రస్సెల్‌కు కోల్‌కతా బిగ్ షాక్.. అయ్యర్, స్టార్క్‌లకు తప్పని నిరాశ

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కు బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రస్సెల్ కు ఈ సారి ఆ జట్టు ఫ్రాంజైజీలు రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఈ విండీస్ ఆల్ రౌండర్ కు భారీ మొత్తంలో చెల్లించే బదులు అతన్ని మెగా ఆక్షన్ లో తక్కువ ధరకు RTM కార్డు ఉపయోగించి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోందట. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ ను వదులుకున్న కోల్‌కతా రస్సెల్ విడిచి పెట్టి పెద్ద సాహసం చేసినట్టు అర్ధమవుతుంది. 

రస్సెల్, శ్రేయాస్ అయ్యర్ తో పాటు ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ లో రూ. 24.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను కూడా ఆ జట్టు వదిలేయనున్నటు సమాచారం. అక్టోబరు 31 (గురువారం) సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి. దీంతో కేకేఆర్ తమ రిటైన్ ప్లేయర్ల విషయంలో ఒక క్లారిటీకి వచ్చింది. సునీల్ నరైన్ , రింకూ సింగ్ , వరుణ్ చక్రవర్తితో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరిలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను రిటైన్ చేసుకున్నారట. వీరితో పాటు ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారట. 

Also Read :- ఐదుగురి కోసం రూ.75కోట్లు.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్స్ లాక్

అయ్యర్, రస్సెల్, స్టార్క్‌లను తిరిగి కొనుగోలు చేయాలనుకుంటే క్యాప్డ్ ప్లేయర్‌పై వేలంలో ఉపయోగించడానికి వారికి ఒకే ఒక రైట్-టు-మ్యాచ్ ఎంపిక మిగిలి ఉంటుంది. రస్సెల్ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో కేకేఆర్ ఒప్పకోలేదట. ఫాస్ట్ బౌలర్ స్టార్క్ కు ఎక్కువ డబ్బు ఇవ్వడానికి ఆసక్తి చూపించట్లేదని సమాచారం. అక్టోబరు 31 (గురువారం) సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి. నవంబర్ చివరి వారంలో జరగనున్నఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అందరు ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది.