ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ రిటైన్ ఆటగాళ్లను ప్రకటించింది. ఏకంగా వారు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. రింకూ సింగ్ ను రూ.13 కోట్లతో టాప్ రిటైన్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ కు ముందు రూ. 50 లక్షల సాలరీతోనే ఆడిన రింకూకు ఒక్కసారిగా రూ. 13 కోట్ల రూపాయలు దక్కాయి. వరుణ్ చక్రవర్తికి రూ.12 కోట్లు.. సునీల్ నరైన్ కు రూ. 12 కోట్లు.. ఆండ్రీ రస్సెల్ కు రూ.. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరిలో హర్షిత్ రాణాకు రూ.4 కోట్లు, రమణదీప్ సింగ్ కు రూ. 4 కోట్లు దక్కాయి.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో పాటు ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ లో రూ. 24.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను కూడా ఆ జట్టు వదిలేసుకుంది. అయ్యర్, స్టార్క్‌లను తిరిగి కొనుగోలు చేయాలనుకుంటే క్యాప్డ్ ప్లేయర్‌పై వేలంలో ఉపయోగించడానికి వారికి రైట్-టు-మ్యాచ్ ఎంపిక కూడా మిగిలి లేదు. అయ్యర్ తో పాటు ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణాలను నిరాశ తప్పలేదు.
ALSO READ | రిటెన్షన్‌లో సన్ రైజర్స్ ఆటగాడే తోప్.. కోహ్లీ, రోహిత్, ధోనిని మించి..
శ్రేయాస్ అయ్యర్ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో కేకేఆర్ ఒప్పకోలేదని తెలుస్తుంది. ఫాస్ట్ బౌలర్ స్టార్క్ కు ఎక్కువ డబ్బు ఇవ్వడానికి ఆసక్తి చూపించట్లేదని సమాచారం. దీంతో వీరిద్దరు 2025 ఐపీఎల్ మెగా వేలంలోకి రానున్నారు. మొత్తం రూ. 79 కోట్ల రూపాయలతో కేకేఆర్ ఆరుగురు ప్లేయర్లను తీసుకుంది. దీంతో వారు రూ. 51 కోట్లతో మెగా ఆక్షన్ లోకి రానున్నారు.
Here are your retained Knights 💜
— KolkataKnightRiders (@KKRiders) October 31, 2024
Next Stop: #TATAIPLAuction 💰🔨 pic.twitter.com/fvr1kwWoYn