KKR vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. మొయిన్ అలీపై వేటు

KKR vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. మొయిన్ అలీపై వేటు

ఐపీఎల్ 2025 లో మంగళవారం (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్ లు అభిమానులని అలరించనున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జయింట్స్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆతిధ్య కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు టోర్నీలో ఇది ఐదో మ్యాచ్. రెండు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించాయి. కేకేఆర్ టేబుల్ లో ఐదో స్థానంలో ఉంటే.. లక్నో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో  కోల్‌కతా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో ఎలాంటి మార్పులు లేకుండానే ఆడుతుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ