RR vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. రాజస్థాన్ జట్టులో శ్రీలంక స్టార్ స్పిన్నర్లు

RR vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. రాజస్థాన్ జట్టులో శ్రీలంక స్టార్ స్పిన్నర్లు

ఐపీఎల్ లో నేడు (మార్చి 26) కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తడబడుతుంది. గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో రెండు జట్లు ఓటమితో ప్రారంభించాయి. రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓడిపోయింది. మరోవైపు కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 

ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ కూడా తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఫజల్ ఫారూఖీ స్థానంలో హసరంగా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.     


రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి