ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 29) మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్ లో ఆర్సీబీ రెండు మ్యాచ్ లాడి ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓడిన తర్వాత పంజాబ్ పై సొంతగడ్డపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మరోవైపు కేకేఆర్ సన్ రైజర్స్ పై తొలి మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు మారులేమీ లేకుండా బరిలోకి దిగుతుంది. కేకేఆర్ తుది జట్టులో స్పిన్నర్ అనుకుల్ రాయ్ కు చోటు దక్కింది.
Also Read:వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్ , కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్(వికెట్ కీపర్ , దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
"I am very confused. They have given me two sheets."
— Prasenjiit Dey (@CricPrasen) March 29, 2024
Shreyas Iyer never fails to let us know that he doesn't pick the Playing XI 😂😂#RCBvKKRpic.twitter.com/YVYi1Dfnut