కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రాణాకు భారీ జరిమానా పడింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. మయాంక్ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో రాణా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సెండాఫ్ పలికాడు.
ఇక క్లాసెన్ విషయంలోనూ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడు. ఈ రెండు తప్పులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు 10 శాతం ఫైన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఐపీఎల్ రూల్స్‌లోని ఆర్టికల్ 2.5ను అతిక్రమించాడని తేలడంతో హర్షిత్ తప్పు ఒప్పుకున్నాడని నిర్వాహకులు తెలిపారు.