ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. ఎప్పటిలాగే ధారాళంగా పరుగులివ్వడంతో కోల్ కతా మరోసారి భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ( 36 బంతుల్లో 50, 7 ఫోర్లు, ఒక సిక్సర్) కి తోడు సాల్ట్ (14 బంతుల్లో 48,7 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు ఓపెనర్లు సాల్ట్, నరైన్ (10) మరోసారి శుభారంభం ఇచ్చ్చారు. పవర్ ప్లే చెలరేగుతూ ఏకంగా 75 పరుగులు చేశారు. ఓ ఎండ్ లో సాల్ట్ బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరో ఎండ్ లో నరైన్ చూస్తూ ఉండిపోయాడు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కష్టాల్లో పడింది. కాసేపటికే వెంకటేష్ అయ్యర్ (16) ఔట్ కావడంతో జట్టును ఆదుకునే బాధ్యతను శ్రేయాస్, రింకూ తీసుకున్నారు.
Also Read: ఒంటి చేత్తో పట్టేశాడు: ఐపీఎల్‌లో గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్
ఈ క్రమంలో రింకూ సింగ్ 24 పరుగులు చేసి ఔటైనా.. శ్రేయాస్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో ఎప్పటిలాగే రస్సెల్ (20 బంతుల్లో 27), రమన్ దీప్ సింగ్ (9 బంతుల్లో 24)మెరుపులు మెరిపించడంతో 220 పరుగుల మార్క్ దాటింది. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాళ్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్,లాకీ ఫెర్గుసన్ తలో వికెట్ తీసుకున్నారు.
Over to our bowlers now 🫡 pic.twitter.com/1CDNuU6LrM
— KolkataKnightRiders (@KKRiders) April 21, 2024