
ఐపీఎల్ 2025లో మంగళవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వచ్చినవారు వచ్చినట్టు బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 44 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్,స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. చమీరాకు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు రహ్మనుల్లా గర్భాజ్, సునీల్ నరైన్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి ఓవర్ లో గర్భాజ్ రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. చమీర వేసిన రెండో ఓవర్ లో నరైన్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. మూడో ఓవర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టడంతో తొలి మూడో ఓవర్లలో కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. మూడో ఓవర్ చివరి బంతికి స్టార్క్ ఒక చక్కని బంతితో గర్భాజ్ (26) ను ఔట్ చేశాడు.
మూడో స్థానంలో వచ్చిన రహానే పవర్ ప్లే ను సద్వినియోగం చేసుకుంటూ వేగంగా పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత స్వల్ప వ్యవధిలో కేకేఆర్ వికెట్లను కోల్పోతూ వస్తుంది. మంచి టచ్ లో ఉన్న నరైన్ (27), రహానే (26) రహానే ఔట్ కాగా.. 10 ఓవర్లో వెంకటేష్ అయ్యర్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ అక్షర్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. యువ బ్యాటర్ రఘువంశీ, రింకూ సింగ్ (36) దూకుడుగా ఆడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. వీరిద్దరూ చివర్లో ఔటైనా.. రస్సెల్ (17) మెరుపులతో కేకేఆర్ 200 పరుగుల మార్క్ అందుకుంది.
A sensational last over from Mitchell Starc keeps KKR under 210 👏#DCvKKR LIVE: https://t.co/yFC6tQeTaz pic.twitter.com/uZRZWJtSFG
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025