IPL 2024: ముజీబ్ ఔట్.. కేకేఆర్ జట్టులో 16 ఏళ్ళ స్పిన్నర్

IPL 2024: ముజీబ్ ఔట్.. కేకేఆర్ జట్టులో 16 ఏళ్ళ స్పిన్నర్

ఐపీఎల్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమందికి రీప్లేస్ మెంట్ ప్రకటించగా.. మరికొందరి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ లిస్టులో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ తో పాటు, ప్రసిద్ కృష్ణ ఉన్నారు. తాజాగా వీరికి ఆయా ఫ్రాంచైజీలు రీప్లేస్ మెంట్ ప్రకటించారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ గాయపడ్డాడు. దీంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ స్థానంలో అదే దేశానికి చెందిన ఆఫ్‌స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేసింది. ఘజన్‌ఫర్‌ వయసు కేవలం 16 సంవత్సరాలే కావడం విశేషం. అతను 20 లక్షల బేస్ ప్రైజ్ కు రాజస్థాన్ జట్టులో చేరతాడు. అల్లా ఘజన్‌ఫర్ ఆఫ్ఘనిస్తాన్‌ తరపున 2 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లాడాడు. వన్డేల్లో 5 వికెట్లు, టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ప్రసిద్ధ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి చేర్చింది. స్టార్ ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాల వల్ల  ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. దీంతో కేశవ్ మహారాజ్ అతను లేని లోటు కూడా తీర్చనున్నాడు. ఈ సీజన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై విజయం సాధిస్తే.. రాజస్థాన్ రాయల్స్ లక్నోపై గ్రాండ్ విక్టరీ కొట్టింది.