KKR vs SRH: బ్యాటింగ్‌లో దంచి కొట్టిన కోల్‌కతా.. సన్ రైజర్స్ ముందు బిగ్ టార్గెట్

KKR vs SRH: బ్యాటింగ్‌లో దంచి కొట్టిన కోల్‌కతా.. సన్ రైజర్స్ ముందు బిగ్ టార్గెట్

ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి కుదేలయ్యారు. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ భాగస్వామ్యానికి తోడు వెంకటేష్ అయ్యర్(29 బంతుల్లో 60:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (32) మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ, కమ్మిన్స్, జీషాన్ అన్సారీ, మెండీస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.       

ALSO READ | IPL 2025: ఐపీఎల్ వదిలి.. అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్ (1) రెండో ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మూడో ఓవర్ లో షమీ నరైన్ (7) ను ఔట్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ అజింక్య రహానే (38), అంగ్క్రిష్ రఘువంశీ (50) జట్టును ఆదుకున్నారు. పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపించడంతో 53 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరూ చక్కగా ఆడారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. 

రెండో వికెట్ కు 81 పరుగులు జోడించిన తర్వాత 38 పరుగులు చేసిన రహానే ఔటయ్యాడు. కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన రఘువంశీ కూడా పెవిలియన బాట పట్టాడు. నాలుగుకు వికెట్లు తీసి మంచి జోరు మీదున్న సన్ రైజర్స్ కు వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు ఉంచలేదు. రెండు ఓవర్లు చిన్నగా ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వెంకటేష్ 26 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రింకూ సింగ్ 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.