
ఐపీఎల్ లో ఆదివారం అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్. ఆ రోజు రెండు మ్యాచ్ లు ఉండడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే రేపు కాకుండా రానున్న ఆదివారం.. అనగా 2025, ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో చిన్న మార్పు చేశారు. ఆ రోజు జరగాల్సిన మ్యాచ్ ను ఏప్రిల్ 8 కి వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితం వేదికలో మార్పు చేసి అదే రోజు నిర్వహించిన బీసీసీఐ.. తాజాగా వేదిక మార్చకుండా డేట్ ఒక్కటే మార్చారు.
దీని ప్రకారం ఏప్రిల్ 6 న జరగాల్సిన కేకేఆర్, లక్నో మధ్య మ్యాచ్ ఏప్రిల్ 8 న మధ్యాహ్నం 3:30 నిమిషాలకు జరుగుతుంది. ఏప్రిల్ 6 న ఒకటే మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 లకు ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం (ఏప్రిల్ 8) మాత్రం రెండు మ్యాచ్ లు ఉంటాయి. మధ్యాహ్నం కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్.. సాయంత్రం చండీఘర్ వేదికగా చెన్నై పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయి.
ఈ ఒక్క మ్యాచ్ కే షెడ్యూల్ లో మార్పు ఎందుకు..?
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఉన్న రోజే (ఏప్రిల్ 6) శ్రీరామ నవమి పండుగ ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి యేటా కోల్‌కతాలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. పండుగ రోజున పశ్చిమ బెంగాల్ అంతటా దాదాపు 20వేలకు పైగా ఊరేగింపులు నిర్వహించే అవకాశం ఉంది. కోల్‌కతాలో శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉండటంతో.. అటు ఊరేగింపు వేడుకలకు.. ఇటు మ్యాచుకు బందోబస్తు ఇవ్వడం కష్టమని కోల్ కతా పోలీసులు ఐపీఎల్ మ్యాచుకు అనుమతి నిరాకరించారు.
🚨 KKR vs LSG Game is Rescheduled 🚨
— CricketGully (@thecricketgully) March 29, 2025
KKR vs LSG Game has been rescheduled to 8th April at 3:30PM.
KKR vs LSG @ 3:30PM | Eden Gardens
PBKS vs CSK @ 7:30PM | Mullanpur pic.twitter.com/OVyGbkC9ZX