RCB vs KKR: చితక్కొట్టారు: భారీ స్కోర్ చేసి చిత్తుగా ఓడిన బెంగళూరు

RCB vs KKR: చితక్కొట్టారు: భారీ స్కోర్ చేసి చిత్తుగా ఓడిన బెంగళూరు

ఐపీఎల్ లో చెత్త బౌలింగ్ తో బెంగళూరు జట్టు మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. 182 పరుగుల భారీ స్కోర్ చేసినా కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ కు ఇది ఏ మాత్రం సరిపోలేదు. కేవలం 16.5 ఓవర్లలోనే ఛేజ్ చేసి ఘన విజయాన్ని సాధించారు. ఓపెనర్ నరైన్, వెంకటేష్ అయ్యర్ మెరుపులకు తోడు శ్రేయాస్ అయ్యర్, ఫిలిప్ సాల్ట్ సహకరించడంతో 7 వికెట్లతో కేకేఆర్ విజయం సాధించి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 

183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. నరైన్, సాల్ట్ విధ్వసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే లో ఏకంగా 85 పరుగులు వచ్చాయి. తొలి ఓవర్ నుంచే వీరిద్దరూ చెలరేగి ఆడారు. మొదటి ఓవర్లో 18 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత  రెండు ఓవర్లలో వరుసగా 14, 14 పరుగులు రావడంతో తొలి మూడో ఓవర్లలోనే స్కోర్ 46 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత నరైన్, సాల్ట్ ఔటయ్యారు. నరైన్ 22 బంతుల్లో 5 సిక్సులు, 2 ఫోర్లతో 47 పరుగులు చేస్తే.. సాల్ట్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశారు.  

ఈ దశలో జట్టును వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడితే.. శ్రేయాస్ అయ్యర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో శ్రేయాస్, రింకూ సింగ్ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.     

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న కోహ్లీ 58 బంతుల్లో 80 పరుగులు చేశాడు.  కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ కు ఒక వికెట్ దక్కింది. చివర్లో దినేష్ కార్తీక్ 3 సిక్సులతో 8 బంతుల్లోనే 20 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 182 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ కు ఒక వికెట్ దక్కింది.