
ఐపీఎల్ సీజన్ 18 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (61 బంతుల్లో 97: 8 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో కేకేఆర్ ను గెలిపించాడు. మరోవైపు టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది.
152 పరుగుల ఒక మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ఓపెనర్లు డికాక్, మొయిన్ అలీ తొలి వికెట్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొయిన్ అలీ తడబడినా డికాక్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. తొలి వికెట్ కు 41 పరుగులు జోడించిన తర్వాత 5 పరుగులు చేసిన మొయిన్ రనౌటయ్యాడు. కాసేపటికే కెప్టెన్ అజింక్య రహానే 18 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఓపెనర్ డికాక్ అద్భుతంగా రాణించాడు.
ఇన్నింగ్స్ ఆసాంతాం ఓ వైపు జాగ్రత్తగానే ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు. జట్టు బ్యాటింగ్ భారమంతా ఒక్కడే భుజానికి వేసుకున్నాడు. ఈ క్రమంలో హసరంగా బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 36 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచిన అతను 97 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. డికాక్ కు యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ (22) చక్కని సహకారం అందించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో హసరంగా ఒక వికెట్ తీసుకున్నాడు.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగులు చేసి ధృవ్ జురెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ స్పిన్ మాయాజాలం చూపించి రాజస్థాన్ ను కట్టడి చేశారు.
THUMPED.
— ESPNcricinfo (@ESPNcricinfo) March 26, 2025
KKR turn it around in Match 2 🔁#RRvKKR SCORECARD 👉 https://t.co/zfFEO05yoc pic.twitter.com/z267XysFgE