
ఐపీఎల్ 2025లో సోమవారం (ఏప్రిల్ 21) గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో గుజరాత్ టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. మరోవైపు కోల్‌కతా 7 మ్యాచ్ ల్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కోల్‌కతా ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. వికెట్ కీపర్ డికాక్ స్థానంలో రహ్మనుల్లా గర్భాజ్ వచ్చాడు. నోర్ట్జే స్థానంలో మొయిన్ అలీ చోటు దక్కించుకున్నాడు. మరోవైపు గుజరాత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ లోకి వచ్చాడు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
Also Read : రాజస్థాన్ కష్టం ఎవరికీ రాకూడదు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి