సముద్రపు కారు..3 గంటల్లో కోల్కతా నుంచి చెన్నైకు..టికెట్ రూ.600 మాత్రమే

సముద్రపు కారు..3 గంటల్లో కోల్కతా నుంచి చెన్నైకు..టికెట్ రూ.600 మాత్రమే

ప్రముఖ పారశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఎపుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా ఓ అద్భుతమైన టెక్నాలజీ గురించి నెటిజన్లకు ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేశారు. అదేంటంటే..సముద్రంలో ప్రయాణించే కారు గురించి. జల మార్గంలో ఓ అద్బుతమైన ఆవిష్కరణ ఇది. ప్రశింసిస్తూ రాశారు. ఇక ఈ కారును తయారు చేస్తున్న కంపెనీ చెబుతున్నదేంటంటే.. సముద్రం మార్గంలో ప్రయాణం సులభతరం చేయడం, ప్రయాణ ఖర్చును కూడా తగ్గించే మార్గం అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ సముద్ర కారును ఐఐటీ మద్రాస్ సహకారంతో స్టార్టప్ కంపెనీ అయిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేస్తుంది. ఈ సముద్ర కారు ద్వారా సముద్రమార్గంలో ప్రయాణం మరింత అభివృద్ది, సులభతరంతోపాటు చాలా తక్కువ ఖర్చుకూడా ప్రయాణించవచ్చంటున్నాయి తయారీ కంపెనీ వర్గాలు.కోల్ కతానుంచి చెన్నైకి 1600 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 600రూపాయలతో ప్రయాణించొచ్చంటున్నారు. ఇది ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌకైనది.

ఇక ఈ సముద్ర కారు ఏవిధంగా నడుస్తుంది.. ఉపయోగించే టెక్నాలజీ ఏంటనేది చూస్తే.. ఈ సముద్ర కారు(స్పెషల్ ఫ్లైట్) సముద్ర ఉపరితలానికి కేవలం 4మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఇది భూమ్యాకర్షణ శక్తిని వినియోగించుకుంటూ రెక్కలపై ఘర్షణ తగ్గించుకుంటుంది. గాలి కుషనింగ్ కారణంగా లిఫ్ట్ ను పెంచుతుంది. ఇది తక్కువ వేగంతో ఎగరడానికి వీలు కల్పిస్తుంది. 

ఈ సముద్రపు కారు నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఒక ఎయిర్ బోయింగ్ విమానం చెన్నై నుంచి కోల్ కతా ప్రయాణించాలంటే గంటకు 2.5నుంచి 3టన్నుల ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అవసరం ప్రస్తుతం కిలో లీటర్ ధర రూ. 95వేలు అయితే ఈ వాటర్ ఫ్లై సీ గ్లైడర్ (సముద్రపు కారు) ఈ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో ప్రయాణఖర్చు చాలా తగ్గుతుంది. 

ప్రస్తుతం ఈ సముద్ర కారు ప్రారంభ దశలోనే ఉంది. 100 కిలోల బరువున్న దీని మొదటి మోడల్ ను ఏరో ఇండియాలో  కంపెనీ తన డిజైన్‌ను మాత్రమే ప్రదర్శిం చింది. 2025  చివరి నాటికి బయటికి వచ్చే అవకాశం ఉంది. 2026 నాటికి చెన్నై నుంచి కోల్‌కతాకు ప్రయాణించగలిగేలా 20 సీట్ల సముద్రపు కారును అభివృద్ధి చేయా లని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.