హైదరాబాద్, వెలుగు : నేషనల్ లెవెల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్చర్లు మెడల్స్ మోత మెగించారు. టోర్నీలో అత్యధికంగా 22 పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో 20 రాష్ట్రాల నుంచి 140 పైచిలుకు ఆర్చర్లు హోరాహోరీగా పోటీ పడ్డారు.
కొల్లూర్ డీపీఎస్ ఆర్చర్లు అండర్-10, 13, 15, 17 కాంపౌండ్, రికర్వ్ కేటగిరీల్లో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. కొల్లూరు డీపీఎస్ చైర్మన్ భీంసేన్, సెక్రటరీ పవన్ విన్నర్లకు ట్రోఫీలు, మెడల్స్ అందించారు.