తమిళ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు, సార్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇటీవలే రాయన్ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే..ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల అయినా.. 'తేనాండాల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్' నుంచి డబ్బులు తీసుకుని వారి సినిమాల్లో నటించకుండా..అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న ఫిర్యాదు గతంలో రాగా..దీంతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ధనుష్‌పై నిషేధం విధించింది. ఇక ధనుష్‌ని తమ సినిమాల్లో కమిట్ చేసే ముందు నిర్మాతల సంఘంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం కూడా తీసుకుంది.
Also Read:-దేవర సినిమా చూసి చచ్చిపోతా..దయచేసి నన్ను బతికించండి
అయితే, ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారమైనట్లు తాజా సమాచారం. రెండు షరతులతో నేపథ్యంలో ధనుష్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్మాతల సంఘం నిర్ణయించింది. ఆ షరతులలో ఒకటి..'ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రంలో నటించడం కాగా.. మరొకటి నుండి వచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడం. దీంతో ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే, ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌లు గతంలో ధనుష్ పై TFPCకి ఫిర్యాదు చేశాయి. ఇక ఈ షరతులపై ధనుష్ పై విధించిన రెడ్ కార్డ్ రద్దు చేయబడింది.
ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే..'సర్'తో మంచి విజయాన్ని రుచి చూసాడు. ప్రస్తుతం ధనుష్, రష్మిక మందన్న, నాగార్జునతో కలిసి డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళం,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.