
Nayanthara: నయనతారపై మండిపడ్డ డైరెక్టర్.. ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టింది..సమయపాలన అనేది హ్యూమన్ లైఫ్ లో చాలా అవసరమని పెద్దలు చెబుతుంటారు.. ఎందుకంటే టైం పంక్చువాలిటీ లేకపోతే మనం చేసే పనుల రిజల్ట్స్ పై ఆ ప్రభావం పడుతుంది.. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి సౌత్ ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. అయితే నయనతార ఇటీవలే టైం పంక్చువాలిటీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా తాను కెరీర్ ఆరంభంలో టైం పంక్చువాలిటీ ని సరిగ్గా పాటించకపోవడంతో సినిమా ఆఫర్లు కోల్పోయానని చెప్పుకొచ్చింది. అయితే తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రముఖ నటుడు, డైరెక్టర్ పార్తిభన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా అఫర్ దక్కించుకున్నాని కానీ షూటింగ్ మొదటి రోజు అనుకున్న సమయానికి వెళ్లలేకపోయానని తెలిపింది. దాంతో డైరెక్టర్ పార్తిభన్ తనపై సీరియస్ అయ్యారని అంతేగాకుండా షూటింగ్ సెట్స్ లో అందరిముందు తనని తిట్టారని నయనతార ఎమోషనల్ అయ్యింది. అంతేగాకుండా తనని ఆ ఆసినిమా నుంచి తప్పించి వేరేవాళ్లని తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ఈ ఇన్సిడెంట్ తో టైమ్ విలువ తెలిసిందని, ఇక అప్పటినుంచి టైమ్ కి ముందే సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్లిపోయేదానినని తెలిపింది.
అయితే ఈ విషయం గురించి గతంలో దర్శకుడు పార్థిబన్ మాట్లాడుతూ, "ఆరోజు నయనతారని 'కుడైకుల్ మళై' సినిమా కోసం షూటింగ్ కి రమ్మని చెప్పాను. దీంతో నయనతార ఉదయం 8 గంటలకు రావాల్సి ఉంది. కానీ ఆమె రాలేదు. దీంతో ఫోన్ చేసి, 'సార్, నేను షూటింగ్ కి వెళుతున్న బస్సు ఎక్కలేదు. దాంతో టైమ్ కి రాలేకపోయానని చెప్పిందని తెలిపాడు. కానీ తాను మాత్రం టైం పంక్చువాలిటీ పాటించని వాళ్లంటే తనకి నచ్చదని కాబట్టి షూటింగ్ సెట్స్ లో ఇక తనకి పని లేదని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోమ్మన్నానని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నటి నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో తప్ప చిన్నాచితక బడ్జెట్ సినిమాలు చెయ్యడం లేదు.. ఆమధ్య తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్, షారుఖ్ ఖాన్ నటించిన "జవాన్" చిత్రంతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతోపాటూ దాదాపుగా రూ.670 కోట్లు (నెట్) కలెక్షన్స్ రాబట్టింది.