Ajith Kumar: హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో..ఆందోళనలో ఫ్యాన్స్..!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి.ఇదిలా ఉంటే ..ప్రస్తుతం హీరో అజిత్ కుమార్ చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం.ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అయితే హీరో అజిత్ 'విదేశాల్లో షూట్ చేయడానికి వెళ్లే ముందు లేదా తన బైకింగ్ ట్రిప్‌లకు వెళ్లే ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు మెడిక్లెయిమ్ కోసం రొటీన్ హెల్త్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ మేనేజర్ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ కుదుటపడ్డారు. 

ఎందుకంటే, గతంలో ఓ భారీ ఆక్సిడెంట్ నుండి బయటపడ్డ అజిత్..తన హెల్త్ చెకప్ కోసం తరుచుగా వెళ్ళొస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరం లేదంటూ హీరో అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. 

కోలీవుడ్ స్టార్ హీరోల్లో  రజినీ,విజయ్ తర్వాత అంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అంటే..అజిత్ అనే చెప్పుకోవాలి. తన సినిమాలు పరంగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఫ్యాన్స్ మనుసులో స్థానం సంపాదించుకున్నారు. అలాగే బైక్ రేసర్ గా కూడా ఆయన ప్రత్యేకత చాటారు. బైక్ డ్రైవింగ్ అంటే అజిత్ కి చాలా ఇష్టం.ఖాళీ దిరికితే సరదాగా అలా దేశం మొత్తం బైక్ మీద తిరుగుతుంటారు. 

ALSO READ :- కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన  విదా ముయార్చి సినిమా చేస్తున్నారు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 60 కోట్ల‌కు    దక్కించుకుంది. 

ఈ సినిమా తరువాత మార్క్ ఆంటోనీ సినిమా దర్శకుడు అధిక రవిచంద్రన్ తో ఓ సినిమా చేయనున్నాడు అజిత్. ఈ రెండు సినిమాల తరువాత అజిత్, గోపీచంద్ మలినేని సినిమా ఉండనుందని సమాచారం.