పవన్ ఓజీ కోసం స్టార్ హీరోని దింపిన తమన్...

పవన్ ఓజీ కోసం స్టార్ హీరోని దింపిన తమన్...

ప్రముఖ తెలుగు హీరో పవన్ కళ్యాణ్ యంగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ(OG) చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కి జోడీ గా మలయాళీ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ హీరో మరియు సింగర్ ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ (తమిళ్ హీరో) హరీష్ ఉత్తమ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 

మార్షల్ ఆర్ట్స్ మరియు గ్యాంగ్ స్టర్స్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓజీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రాజకీయాల్లో పడి సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన పవన్ మళ్ళీ ఈ మధ్య షూటింగులు పూర్తీ చేసేందుకు టైం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన అర్జునరెడ్డి హీరోయిన్.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ దర్శకుడు తమన్ ఓజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఇందులోభాగంగా ఓజీ చిత్రంలోని థీమ్ సాంగ్ ని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పాడించినట్లు తెలిపాడు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా తమన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో తమన్ తోపాటు డైరెక్టర్ సుజిత్, శింబు తదితరులు కనిపించారు.దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే గతంలో శింబు పలు పలువురి టాలీవుడ్ హీరోల చిత్రాల్లో పాటలు పాడగా మంచి హిట్ అయ్యాయి.

అయితే ఓజీ చిత్రం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు మరియు డిప్యూటీ సీఎం పదవీ బాధ్యతలతో బిజీగా ఉండటంతో షూటింగ్ పూర్తీ చెయ్యలేకపోయాడు. దీంతో ఈ చిత్ర విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది.