
కోలీవుడ్‌లో సక్సెస్ సాధించిన ‘డా.. డా’ చిత్రం ‘పా పా’ పేరుతో తెలుగులోకి వస్తోంది. కవిన్, అపర్ణదాస్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను దర్శకుడు మారుతి లాంచ్ చేసి, తెలుగులోనూ మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ చెప్పారు. నిర్మాత నీరజ కోట మాట్లాడుతూ ‘తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానాంశంగా లవ్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ వచ్చిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తమిళంలో ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని, సూపర్ హిట్ సాధిస్తుందని నమ్ముతున్నాం. ఈనెల 13న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలో రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.