అటవీ అధికారులు మా ఇండ్లు కూల్చారు: ఆదివాసీలు

అడవుల్లో ఉంటున్న తమపై దాడి చేసి.. అటవీ శాఖ అధికారులే తమ ఇళ్లు కూల్చేశారన్నారు కుమ్రంభీం జిల్లాకు చెందిన ఆదివాసీలు. అధికారులే తమను బలవంతంగా వెంపల్లి అటవీశాఖ డిపోకు తరలించారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో ఆదీవాసీలను హైదరాబాద్ తీసుకొచ్చారు అధికారులు. మొదట అరణ్యభవన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్కడి నుంచి కుందన్ బాగ్ లోని హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి తీసుకెళ్లారు. చీఫ్ జస్టిస్ నివాసంలో.. ప్రస్తుతం వాదనలు  కొసాగుతున్నాయి.