మంత్రి పదవి వస్తే.. హోంశాఖ చేయాలని ఉంది : రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి వస్తే.. హోంశాఖ చేయాలని ఉంది : రాజగోపాల్ రెడ్డి
  • రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్,     వెలుగు: తనకు మంత్రి పదవి ఇస్తున్నట్లు హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.  మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నానని, ఒకవేళ క్యాబినెట్ లో బెర్త్ దొరికితే హోంశాఖ చేయాలని ఉందని మనస్సులోని మాట బయటపెట్టారు. 

తనకు ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజల పక్షాన నిలబడుతానని చెప్పారు. ఇంతకు ముందు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా సమర్థవంతంగా పనిచేశానని, సమర్థతను బట్టి మంత్రులను ఎంపిక చేయాలని పార్టీకి సూచించారు.