చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రచారం

చండూరు, వెలుగు: తనను నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోతున్నానని రాజగోపాల్ రెడ్డి బాధపడేవారని, వారి కోసమే రాజీనామా  చేసి ధర్మం కోసం పోరాడుతున్నారని ఆయన భార్య లక్ష్మి అన్నారు. శుక్రవారం చండూరు మండలంలోని బోడంపర్తి, తాస్కాని గూడెం గ్రామాలలో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేశారు.

ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసిన వెంటనే గట్టుప్పల్​ను మండలంగా ఏర్పాటు చేయడంతో పాటు..గొల్ల కురుమలకు ఎకౌంట్లో డబ్బులు వేశారని..రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుందని ఆ డబ్బులను ఫ్రీజ్ చేయించారన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన 50వేల నిరుపేద కుటుంబాలకు  రాజగోపాల్ రెడ్డి నిత్యావసర సరుకులను అందించారన్నారు.