జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు.  టాస్క్, ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌‌‌‌ను సోమవారం హైదారాబాద్‌‌లోని తన నివాసంలో విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులోభాగంగా ప్రతిరోజు వివిధ సంస్థలతో సమావేశాలు జరుపుతున్నట్లు  తెలిపారు. నల్గొండలో త్వరలో ఏర్పాటు చేయబోయే  స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్ ద్వారా ఒక్కో సెషన్‌‌లో పదివేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సీఎఫ్ఎమ్​సీ సీఈవో సత్యనారాయణ, ప్లేస్ మెంట్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.