కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి : బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇసుక దందా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు ఇచ్చిన పరిహారమెంతో బస్వాపూర్ నిర్వాహిసతులకు ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము  తెలంగాణ బిడ్డలం కాదా అని ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదన్న కారణంగా రూ.650కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టుకుంటున్న సీఎం కేసీఆర్..నిర్వాసితులకు ఇచ్చేందుకు రూ.350కోట్లు లేవా అని ప్రశ్నించారు.  ముఖ్మయంత్రి ఇప్పటికైనా స్పందించి బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్రలో బెదిరించైనా పనులు చేపించుకున్నమని కానీ ఇప్పుడు ఏ పనులు జరగడంలేదని వాపోయారు. బిడ్డ ఢిల్లీకి, కొడుకు బెంగళూరుకు, సీఎం కేసీఆర్ ఇంకెక్కడికో పోతే ఎవరిని అడగాలని వాపోయారు. ముఖ్యమంత్రి హయాంలో ఎమ్మెల్యేలు గుట్టలు కొనుక్కొని వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.