వంద రోజుల్లోపే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.రూ. 500లకు గ్యాస్ సిలిండర్ హామీ అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. తామిచ్చిన హామీలు ఇప్పటికే అమలు చేసే వాళ్లం కానీ....గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాల వల్ల తమకు కాస్త ఆలస్యం అయిందన్నారు. విద్యత్ శాఖను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంట్ కొనుగోళ్లలో అవినీతి భయటపడుతుందన్నారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ కుటుంబం.. విచారణ తర్వాత జైలుకు పోవటం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి.
కవిత,కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు కోమటిరెడ్డి. అవినీతికి కేరాప్ అడ్రస్ కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నాయకులన్నారు. రేపో మాపో జగదీష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దమ్ము బీఆర్ఎస్ కు లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుడిపాజిట్లు కూడా రావు..క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీలోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ బాంబ్ పేల్చారు మంత్రి కోమటిరెడ్డి.