రూ. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రూ. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • హెరిటేజ్ బిల్డింగ్ కు గతంలో మాదిరిగా మరమ్మతులు
  • ఆగాఖాన్ ట్రస్ట్ కు పనుల అప్పగింత
  •  మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పాం
  •  పార్లమెంటులో సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే చోటుకి
  • రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ రెనోవేషన్ బాధ్యతలు ఆగాఖాన్ ట్రస్ట్  చేపట్టిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 3 నెలల్లో అసెంబ్లీలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు. నిజాం తరహాలో అసెంబ్లీని ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

ALSO READ | ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు

 ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే వాహనంలో సీఎం, మంత్రులు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా కేటీఆర్ తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ చార్జీలు పెంచొద్దంటూ ఈఆర్సీ వద్దకు వెళ్లడం పెద్ద జోక్ అన్నారు. పార్లమెంటులో ఒక్క సీటు రాకున్నా.. అసెంబ్లీలో ఓడించి గద్దె దించినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని అన్నారు. పేదలకు ప్రభుత్వం 200 యూనిట్ల కరెంటు ఇస్తుందని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.