ట్రాన్స్ జెండర్స్కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రాన్స్ జెండర్స్కు  ప్రభుత్వం ప్రోత్సాహకాలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రాన్స్ జెండర్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో  కార్యక్రమంలో పాల్గొన్నారు.  యువతులకు , ట్రాన్స్ జెండర్స్ కి స్వయం ఉపాధి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. స్వచ్చంద సంస్థలు మహిళల కోసం  అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు.  కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమనికి 2 లక్షల రూపాయల  విరాళం అందజేస్తానని ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సమాజంలో ట్రాన్సజెండర్స్ ను  చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  

 వైఎస్సార్  ఆశయ సాధనకు ఈ కార్యక్రమం తోడ్పాటు అవుతుందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  శిశు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు . మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తుందన్నారు.  పాఠశాలలో బాలికల టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, సౌకర్యాల కల్పన  కోసం నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.