రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ కోసం దౌర్జన్యంగా సర్వేలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. దళితుల్ని ధనవంతుల్ని చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వారి భూముల్ని లాక్కొని వేలం వేయడం ఏమిటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.