బడ్జెట్ ను విమర్శించే హరీశ్, కేటీఆర్ మూర్ఖులు: కోమటిరెడ్డి

బడ్జెట్ ను విమర్శించే హరీశ్, కేటీఆర్ మూర్ఖులు: కోమటిరెడ్డి

 కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాస్తవికత ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని రంగాల్లో బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.  కేసీఆర మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులు రాష్ట్రంపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు.

త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు.  బడ్జెట్ పై విమర్శలు చేస్తున్న హరీశ్ రావు, కేటీఆర్  మూర్ఖులని ధ్వజమెత్తారు.  కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చిండని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్..అని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూర్ఖులు: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూర్ఖులు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. చూడాల్సింది వాళ్లు, మేము కాదు. ఆ ప్రాజెక్టు గురించి వాళ్లకు అ ఆలు కూడా తెలియదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టును చూడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి చూడొచ్చు.”అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నరని విమర్శించారు.

ALSO READ :- రాష్ట్ర స్థాయి సబ్ ​జూనియర్​ అథ్లెటిక్స్ ​ఓవరాల్ ​చాంపియన్​గా ఆదిలాబాద్​