బొకేలు వద్దు డబ్బులు ఇవ్వమన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, వెలుగు:  కార్యకర్తలు, అభిమానులు తనకు న్యూ ఇయర్‌‌‌‌ శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌‌కు రావొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తన కోసం బోకేలు, శాలువాలు కొనవద్దని.. అదే డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు జమచేయాలని పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన’ను సక్సెస్‌‌ చేయాలని కోరారు.  గ్రామాల్లో నిరక్షరాస్యులు,  అచేతనులకు అండగా ఉండాలని సూచించారు.  వచ్చే వారంలో నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తానని చెప్పారు.