మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని లచ్చన్న గ్రామంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు ఇటువైపు అడుగుపెట్టని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక రావడంతో మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా కేసీఆర్ సర్కారు ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ప్రజలు టీఆర్ఎస్ పాలనకు ఇప్పటికైనా చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధి మిగతా ప్రాంతాల్లో ఎందుకు జరగడం లేదని కోమటిరెడ్డి లక్ష్మీ ప్రశ్నించారు. రాజగోపాల్ పార్టీ మారింది ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమని ఆమె మరోసారి గుర్తు చేశారు. మునుగోడులో జరిగే ధర్మ యుద్ధంలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.