మునుగోడులో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. చండూరు మండలంలో కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ప్రభుత్వంపై కొట్లాడారని గుర్తు చేశారు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారని.. మునుగోడును అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
మునుగోడును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలంటే రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.