కేటీఆర్.. అహంకార మాటలు మానుకో : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కేటీఆర్.. అహంకార మాటలు మానుకో : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  • సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ వి అహంకారపు మాటలని, వెంటనే వాటిని మానుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హితవు పలికారు. కరీంనగర్​లోని కాంగ్రెస్​పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల పేరిట కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ పై అహంకారంతో మాట్లాడటం సరికాదన్నారు.  ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ఓటు ద్వారా ఎన్నుకున్నామని, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించుకున్నామని తెలిపారు.

 బీఆర్ఎస్ లో అధ్యక్షుడు, వర్కింగ్​ప్రెసిడెంట్​ఇద్దరూ తండ్రీకొడుకులే ఉన్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన సమావేశంలో ఒకవైపు కొప్పుల ఈశ్వర్, మరోవైపు గంగుల కమలాకర్ కూర్చున్నారని, వారిలో ఒక్కరికైనా అధ్యక్ష లేదా వర్కింగ్​ప్రెసిడెంట్​పదవి ఇవ్వొచ్చు కదా అని సూచించారు. నాయకులు  శ్రవణ్ నాయక్, దన్న సింగ్, రవీందర్ గౌడ్, కుర్ర పోచయ్య, తమ్మడి ఎజ్రా, మాసుం ఖాన్, మహమ్మద్ బారీ,అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.